11 April, 2019

vijay-devarakonda-19-4-10

వరుస హిట్‌లతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండతో ‘మజిలీ’ దర్శకుడు శివ నిర్వాణ ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు ఫిల్మ్‌నగర్ సర్కిళ్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రెడ్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత విజయ్ చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు మరో క్రేజీ ప్రాజెక్టుకు కూడా విజయ్ ఓకే చెప్పినట్లు సమాచారం.

అయితే దర్శకుడు శివ నిర్వాణ.. విజయ్‌తో సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నారట. నిన్నుకోరి, మజిలీ సినిమాల హిట్లతో మంచి ఫామ్‌లో ఉన్న శివ నిర్వాణ.. విజయ్ కోసం ఓ కథను సిద్ధం చేస్తున్నాడట. త్వరలో విజయ్‌ను కలిసి కథను వినిపించనున్నాడట. అయితే ఈ విషయాన్ని దర్శకుడు శివ నిర్వాణ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం ‘మజిలీ’ సినిమా హిట్‌ కావడంతో మరో ప్రాజెక్టుపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

----------------------------------------------------------------------------

nikhil siddhardh, janasena support, trs support

----------------------------------------------------------------------------