December 19, 2018

vijay-devarakonda-karan-johar

బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తాజాగా కాఫీ విత్ కరణ్ షో లో మాట్లాడుతూ విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ అంటే తనకు చాలా బాగా ఇష్టమని చెప్పింది. అదే సమయంలో కరణ్ జోహార్ తాను ఒక సినిమాను విజయ్ దేవరకొండ తో చేయాలనుకుంటున్నట్లుగా చెప్పినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా యష్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆధిత్య చోప్రా కూడా మెల్లగా విజయ్ దేవరకొండ కు లైన్ వేస్తున్నట్లు గా బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ క్రేజీ హీరో అంటే విజయ్ దేవరకొండ పేరు మొదట వినిపిస్తుంది. అర్జున్ రెడ్డి గీత గోవిందం చిత్రాలతో యూత్ ఐకాన్ గా మారిపోయిన విజయ్ దేవరకొండ ఇటీవలే ‘నోటా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా విడుదలకు చాలా నెలల ముందే మొత్తం మూవీ లీక్ అయ్యింది. సినిమా విడుదల సమయంలో పెద్దగా అంచనాలు లేవు కాని సినిమా విడుదల తర్వాత ఏకంగా పాతిక కోట్ల షేర్ ను దక్కించుకోవడంతో పాటు ఇతర రైట్స్ ద్వారా నిర్మాతకు భారీ లాభాలను తెచ్చి పెట్టాడు. తెలుగులో అంతటి క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ గురించి బాలీవుడ్ లో కూడా చర్చ జరుగుతుంది.

కరణ్ జోహార్ మరియు ఆధిత్య చోప్రాలు త్వరలోనే విజయ్ దేవరకొండను బాలీవుడ్ కు తీసుకు వెళ్లేందుకు విడి విడిగా ప్రయత్నాలు చేస్తున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజమెంతో అబద్దమెంతో కాని ప్రస్తుతం అక్కడ విజయ్ దేవరకొండ పేరు మాత్రం మారుమ్రోగిపోతుంది. ప్రస్తుతం తెలుగులోనే చాలా కమిట్ మెంట్స్ ఇచ్చిన విజయ్ దేవరకొండ ఒక వేళ నిజంగానే బాలీవుడ్ నుండి ఆఫర్స్ వస్తే ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. డియర్ కామ్రేడ్ చిత్రంను వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత విజయ్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. ఆ చిత్రం తర్వాత క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఒక చిత్రం చేసేందుకు కమిట్ అయ్యాడు. మరి హిందీలో ఈయన ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో చూడాలి.