07 March, 2019

kaushal-tv5

బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ ను టీవీ 5 వదిలేలా లేదు. కౌశల్ డాక్టరేట్ గిన్నీస్ బుక్ రికార్డు పీఎం కాల్ అన్ని కూడా ఫేక్ అంటూ నిరూపించిన టీవీ5 తాజాగా కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాల్లో లొసుగులను కూడా బయట పెట్టింది. కౌశల్ ఆర్మీ మాజీ మెంబర్స్ కొందరు కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ నుండి తొలగించబడ్డారు. వారు టీవీ5 స్టూడియోలో మూర్తితో చర్చ కార్యక్రమంలో పాల్గొని నానా రచ్చ చేశారు. కౌశల్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ పై రకరకాలుగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఫౌండేషన్ ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లుగా కౌశల్ ప్రకటించిన విషయం తెల్సిందే.

కౌశల్ ఊపిరి తిప్పుకోకుండా చేస్తున్న టీవీ 5 తాజాగా ఒక వీడియో సాంగ్ ను విడుదల చేయడం జరిగింది. అందరు గొర్రెలే అంటూ సాగే ఆ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కౌశల్ అభిమానులు అంతా కూడా గొర్రెలే అంటూ సాగే ఆ పాట కౌశల్ పరువును మరింతగా తీస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే కౌశల్ ఏదైనా తప్పు చేస్తే ఆయన్ను విమర్శలు చేయాలి కాని ఆయన అభిమానులను గొర్రెలే అంటూ పాట పాడటం ఏంటీ అంటూ కొందరు అంటున్నారు. కౌశల్ ను నమ్మి మేము గొర్రెలం అయ్యాం అంటూ లిరిక్ సాగింది.

ఆ పాటలో కొన్ని బిగ్ బాస్ క్లిప్స్ తో పాటు కొందరు కౌశల్ ను తిట్టిన క్లిప్స్ కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పుకుని గెలిచిన తర్వాత పవన్ ఏమైనా తోపా అంటూ కామెంట్ చేస్తావా నువ్వు ఏమైనా తోపువా అంటూ ఉన్న ఒక క్లిప్ ను కూడా పాటలో పెట్టడం జరిగింది. టీవీ 5 యూట్యూబ్ ఛానెల్ లో ఈ వీడియోను పోస్ట్ చేయడం జరిగింది. కౌశల్ ను విమర్శిస్తూ ర్యాప్ చేసిన ఈ సాంగ్ వీడియోకు పెద్ద ఎత్తున కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఈ పాటపై కౌశల్ ఎలా రియాక్ట్ అవుతాడనేది చూడాలి..

kaushal army, tv5, exposed

----------------------------------------------------------------------------