07 March, 2019

srinidhi-chidambaram

కేంద్ర మాజీమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి చిదంబరం కోడలు, కార్తీ చిదంబరం సతీమణి, భరతనాట్య కళాకారిణి డాక్టర్ శ్రీనిధి చిదంబరం త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల బరిలో దిగుతారా ? అంటే అవునంటున్నారు కాంగ్రెస్ పార్టీ వర్గాలు. గత ఎన్నికల్లో శివగంగ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన భర్త కార్తీ చిదంబరం వెనుక ఉండి సోషల్ మీడియా ప్రచారం సాగించిన శ్రీనిధి వైద్యురాలిగా పనిచేస్తున్నారు.భరతనాట్య కళాకారిణి అయిన శ్రీనిధి భర్త కార్తీ స్థానంలో శ్రీనిధిని ఎన్నికల బరిలోకి దించాలని కాంగ్రెస్ కార్యకర్తలు కోరుతున్నారు. ఇప్పటికే శివగంగ పార్లమెంటు స్థానం నుంచి చిదంబరం ఏడుసార్లు విజయం సాధించి కేంద్రమంత్రిగా పనిచేశారు.

గత 2014 లోక్ సభ ఎన్నికల్లో తండ్రి స్థానంలో అతని కుమారుడు కార్తీ చిదంబరం పోటీ చేసినా 1,04,678 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. శివగంగ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో శ్రీనిధి పాల్గొని ప్రసంగించడంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆశ్చర్యపోయారు. గతంలో భర్త వెనుక ఉండి వాట్సాప్ గ్రూప్ లో ప్రచారం చేసిన శ్రీనిధి మొట్టమొదటి సారి కార్యకర్తల ముందుకు వచ్చారు. శ్రీనిధి ఎన్నికల్లో పోటీ చేస్తే సగం ఉన్న మహిళా ఓట్లను కైవసం చేసుకోవచ్చని, దీనిద్వార సునాయాసంగా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించవచ్చని కాంగ్రెస్ కార్యకర్తలంటున్నారు.

srinidhi, chidanbabram daughter in law, sivaganga mp seat

----------------------------------------------------------------------------