11 April, 2019

Sri-Reddy

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ.. తన నోటికి వచ్చినట్లుగా మాట్లాడే అతి కొద్ది మందిలో సినీ నటి శ్రీరెడ్డి ముందుంటారు. క్యాస్టింగ్ కౌచ్ మీద ఉద్యమం అంటూ తెర మీదకు వచ్చి.. కొన్నాళ్ల పాటు తెలుగు మీడియాలో చెలరేగిపోయిన ఆమె.. తర్వాతి కాలంలో హైదరాబాద్ నుంచి చెన్నైకి షిఫ్ట్ కావటం తెలిసిందే.

మెగా బ్రదర్స్ మీద తరచూ ఒంటి కాలి మీద లేచే శ్రీరెడ్డి.. తాజాగా మరోసారి అదే తీరహాను ప్రదర్శించారు. ఫేస్ బుక్ లైవ్ లో ఆమె మెగాబ్రదర్స్ పవన్.. నాగబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక దానికి ఒక దానికి సంబంధం లేని రీతిలో పాయింట్లను కలుపుతూ పవన్ ను మాటలతో ఉతికి ఆరేసే ప్రయత్నం చేశారు.

ఫేస్ బుక్ లైవ్ లో దాదాపు 39 నిమిషాల పాటు మాట్లాడిన ఆమె.. భారీ రచ్చకు తెర తీశారని చెప్పాలి. ఆమె చేసిన వ్యాఖ్యల్లో కీలకమైనవి ఆమె మాటల్లోనే చూస్తే..

1 ‘పవన్ మంచోడు కాదు అలా అని చెడ్డోడు కూడా కాదు. ఆయన ఓ నటుడు మాత్రమే. దయచేసి ఆయన మాటలను నమ్మి ఉన్మాదులుగా మారొద్దు

2 ఓటు ద్వారాఏపీ ప్రజలు ఆంధ్రప్రదేశ్ రుణం తీర్చుకుని అభివృద్ధి చేసుకోవాలి.

3 నాగబాబుకు ఓటెయ్యద్దని చెప్పిన శివాజీరాజాను నోటికి వచ్చినట్టు తిట్టిన దిలీప్ సుంకర ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.

4 ‘ఓ మహిళగా పవన్ తల్లి గురించి మాట్లాడిన మాటలకు సారీ చెబుతున్నా. జనసేనకు వ్యతిరేకంగా మాట్లాడితే చంపేస్తాం అంటూ కామెంట్లు చేస్తారు. రౌడీయిజం చేస్తారా. అసలేం తెలుసురా మీకు పవన్ నాగబాబు గురించి.

5 నాగబాబుకు ఎంత పొగరు. సాటి ఆర్టిస్టులకు డబ్బులు లేనంత మాత్రాన నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా. నరసాపురం నియోజకవర్గంలో పదివేల రూపాయల గుప్తదానం చేశావా? కనీసం పది రూపాయలు ఎవరికైనా దానం చేశావా? వరుణ్తేజ్.. నిహారికలను తీసుకొస్తే గెలుస్తావా?

6 మీ తమ్ముడు వంశపారంపర్య రాజకీయాలు చేయమన్న ఉత్తముడు.. ఉదాత్తుడు కదా. మరి నిన్నెందుకు తీసుకొచ్చాడు? రాజకీయ నాయకులను వెధవలు.. రా అంటున్నావు. ఏరా పోరా అంటున్న మిమ్మల్ని నేను కూడా అలానే అంటా. మీరే నాకు ఆ హక్కు ఇచ్చారు.

7 ఏందిరా పవన్ కల్యాణ్ నీ యాక్టింగ్ లు. బొచ్చెలో తినడం. పవన్ ఏం చేశావని నీ అన్నను ఎంపీగా గెలిపించాలి. నువ్వు చెప్పిన వాళ్లందరికీ ఓటు వేయాలా?

8 కాపుల్లో ఉత్తములు ఉన్నారు. అధోగతి పాలైన వారు ఉన్నారు. కమ్మ రెడ్డి కాపు అయినా ప్రతీ కులంలో చెడ్డోడు ఉన్నాడు మంచోడు ఉన్నాడు. పవన్ మంచోడు కాదు అలా అని చెడ్డోడు కాదు. రాజకీయంగా కొన్ని లక్షణాలు ఉండాలి.

9 చదువు రాని వాడివి ఏవిధంగా ఐఏఎస్ల ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటావు. టెన్త్ సర్టిఫికెట్లు దొంగతనంగా సృష్టించావు. సీఎం అయితే వందల కోట్ల ఫైల్స్పై సంతకం చేయాల్సి ఉంటుంది.

10 సినిమా ఇండస్ట్రీని దోచుకుని కోట్లు కోట్లు సంపాదించావు. కారు లేదంటావు. ఈఎంఐలు కట్టలేనంటావు. మరి నీకు హెలికాప్టర్లు ఎక్కడినుంచి వచ్చాయి?

11 కానిస్టేబుల్ కొడుకునంటావు. ఐటీ కోట్లకు కోట్లు కట్టానంటావు. డబ్బుల్లేవంటావు. పైత్యం ఉన్న ఇలాంటి వ్యక్తిని కొంతమంది ఉన్మాదులు.. కాపు వ్యక్తి సీఎం కావాలనే వ్యక్తులు నీ వెనుక తిరగొచ్చు. కనీసం అబద్ధాలైనా కరెక్టుగా గుర్తు పెట్టుకుని చెప్పు.

12 పవన్ కల్యాణ్ అనే వెధవకు దరిద్రుడైన నాగబాబుకి కాపు సామాజిక వర్గానికి చెందిన కొంతమందికి ఓటు వేసే ముందు ఆలోచించండి. రాజకీయ నాయకులు మాకు సేవ చేయడానికి మాత్రమే మీరున్నది. దయచేసి మీ ఓటు ఎవరికి వేయాలో ఆలోచించి వేయండి’.

----------------------------------------------------------------------------

sri reddy, attacks, pawan nagababu

----------------------------------------------------------------------------