11 April, 2019

sri-bharat-tdp

బాలయ్య పెద్దఅల్లుడు నారాలోకేష్ కన్నా, చిన్నఅల్లుడు శ్రీభరత్ చాలా హుషారు, తెలివైనవాడు అని టాక్ వినిపిస్తోంది. పట్టుమని పాతికేళ్లు వున్న ఈ కుర్రాడు చంద్రబాబును, లోకేష్ ను వంచి మరీ విశాఖ ఎంపీ టికెట్ తెచ్చుకున్నారు. అప్పుడు బాలయ్య పట్టుపట్టి వుంటారులే అనుకున్నారు అంతా.

కానీ టికెట్ వచ్చిన కొద్ది రోజుల్లోనే శ్రీభరత్ ప్రచారం, పార్టీ జనాలను దగ్గరకు చేర్చుకున్నవైనం, వాళ్లను మొత్తానికి తనముందు లైన్లో నిల్చోపెట్టుకున్న సంగతి చూసి, చిన్నఅల్లుడు ఎప్పటికీ చిన్నఅల్లుడేనని దేశం వర్గాలు చమత్కరిస్తున్నాయి.

తను ఎంపీగా వెళ్లడం తప్పించుకోవడం కోసం గంటా శ్రీనివాసరావు, కిందామీదా పడి శ్రీభరత్ కు టికెట్ రావడలో తనవంతు పాత్ర పోషించారు. కానీ ఇప్పుడు భరత్ వ్యవహారశైలి, పార్టీ జనాలను మేనేజ్ చేస్తున్న తీరు, పార్టీపై తీసుకుంటున్న పట్టుచూసి గంటానే టెన్షన్ పడుతున్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

భరత్ గెలిస్తే, ఇక విశాఖ తెలుగుదేశంపై తనపట్టు తగ్గిపోతుందని గంటా టెన్షన్ పడుతున్నట్లు పార్టీ కార్యకర్తల్లో వినిపిస్తోంది. మొత్తంమీద తెలుగుదేశం పార్టీలో మరోసారి 'చిన్న అల్లుడు'- 'పెద్ద అల్లుడు' అంశం డిస్కషన్ గా మారుతోంది. మళ్లీ చరిత్ర పునరావృతం అవుతుందా? చంద్రబాబు వుండగా సాధ్యంకాదనే అనుకోవాలి.

----------------------------------------------------------------------------

sri bharat, ganta srinivasa rao, scared of

----------------------------------------------------------------------------