11 April, 2019

sampoornesh-babu-sunny-leone

మొదట్లో సన్నీలియోన్ ఎవరో తనకు తెలియదని బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు అన్నారు. మంచు మనోజ్ నటించిన ‘కరెంట్ తీగ’లో ఆయన నటించారు. ఈ సినిమాలో సన్నీలియోన్ బోయ్ ఫ్రెండ్‌గా సంపూర్ణేశ్ బాబు నటించారు. ‘‘కరెంట్ తీగ సినిమాలో వేషం ఉందని మోహన్ బాబు నన్ను పలిచారు. వెంటనే మోహన్ బాబు వద్దకు వెళ్లా. ఏమయ్యా సన్నీలియోన్ ఎవరో నీకు తెలుసా అని ఆయన అడిగారు. నాకు తెలియదు అన్నాను. ఈ సినిమాలో ఆమె నీ లవర్‌గా చేస్తున్నారు అని మోహన్ బాబు చెప్పారు.

షూటింగ్ కు కేవలం ఒక్క రోజు మాత్రమే కావటంతో ఆమెతో పెద్దగా మాట్లాడలేదు. షూటింగ్ అయిన తర్వాతే సన్నీలియోన్ ఎవరో నాకు తెలిసింది. కరెంట్ తీగ సినిమా విడుదలైన తర్వాత నేను ఎక్కడి వెళ్లినా సన్నీతో ఛాన్స్ కొట్టేశావ్ అంటూ చాలా మంది ఆటపటిస్తున్నారు.’’ అని అన్నారు.

----------------------------------------------------------------------------

sampoornesh babu, sunny leone, not know

----------------------------------------------------------------------------