07 March, 2019

salt-19-37

మనం తినే ఆహారంలో ఉప్పు శాతం ఎక్కువైతే డేంజరేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధ్యమైనంతవరకు ఉప్పు తక్కువగా తినడమే బెస్ట్ అన్నది వారి వాదన. అమెరికా వంటి దేశాల్లో పెద్దలు రోజూ 2,300 గ్రాములకన్నా ఎక్కువగా ఉప్పు తింటున్నారని, కానీ దీన్ని 1500 గ్రాములకు తగ్గించాలని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సూచిస్తోంది. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీరానికి ఎక్కువ నీరు అవసరమవుతుంది. దీంతో బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది.

చివరకు ఇది గుండె జబ్బులకు దారి తీస్తుంది సుమా అని ఈ అకాడెమీ వారు వార్నింగ్ ఇస్తున్నారు. హోటళ్ళు, రెస్టారెంట్ల యాజమాన్యాలు కూడా తమ వంటకాలు, ఆహార పదార్తాల్లో ఉప్పు తక్కువగా ఉండేలా చూడాలని, ఈ మేరకు ప్రభుత్వం తప్పనిసరిగా చట్టం తేవాలని వీరు సిఫారసు చేస్తున్నారు.సోడియం ఇన్ టేక్ ఎక్కువైతే హార్ట్ డిసీజ్ ముప్పు పొంచి ఉంటుంది.. ఎన్నో అధ్యయనాలు ఈ విషయాన్ని రుజువు చేశాయి అని ఫుడ్ ఎక్స్ పర్ట్స్ పేర్కొన్నారు. 4-8 ఏళ్ళ మధ్య వయస్సు పిల్లలు రోజుకు సుమారు వెయ్యి గ్రాములు, 9-13 ఏళ్ళ మధ్య వయస్సువారు 1200 గ్రాములు, 14 ఏళ్ళ నుంచి పెద్ద వయస్కులు 1500 గ్రాములకు మించి ఉప్పు తినరాదని ఘంటాపథంగా సూచిస్తున్నారు.

salt consumption, dangerous, killing

----------------------------------------------------------------------------