07 March, 2019

ramcharan-sharwananad-19-3

సినీ నటుల్లో కనిపించే స్నేహభావం వారి వారి అభిమానులకు అమితమైన ఆనందాన్నిస్తుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో యంగ్ హీరోస్ అంతా ఎంతో స్నేహంగా మెలుగుతూ ఒకరి సినిమాలను మరొకరు ప్రమోట్ చేస్తుండటం, బర్త్ డే విషెస్ చెప్పుకుంటుండటం ఎక్కువగా కనిపిస్తోంది. ఇది తమ తమ అభిమాన వర్గాల్లో కూడా స్నేహపూర్వక వాతావరణాన్ని నెలకొల్పుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా యంగ్ హీరో శర్వానంద్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆకట్టుకునే విధంగా పోస్ట్ పెట్టారు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్.

1985వ సంవత్సరం సరిగ్గా ఇదే రోజున జన్మించిన శర్వా.. ఈ రోజుతో తన 35వ ఏట అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన రామ్ చరణ్.. అతను తన జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తి అని పేర్కొన్నారు. శర్వానంద్.. తన కెరీర్‌లో మరిన్ని మైలురాళ్ళు చేరుకోవాలని ఆయన కోరుకున్నారు. ఈ మేరకు శర్వాతో కలిసి దిగిన పిక్ షేర్ చేశారు రామ్ చరణ్.

ram charan, sharwanand, birthday

----------------------------------------------------------------------------