07 March, 2019

pooja-hegde-allu-arjun-19-3

హీరోయిన్ పూజా హెగ్గేకు దర్శకుడు త్రివికమ్, హీరో అల్లు అర్జున్ మరోసారి సినిమా అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అరవింద సమేత’లో పూజా హీరోయిన్‌గా నటించారు. హరీష్ శంకర్-అల్లుఅర్జున్ కాంబోలో వచ్చిన ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలోనూ పూజా నటించారు. ఇప్పటికే త్రివిక్రమ్-అల్లుఅర్జున్ కాంబినేషన్‌లో జులాయి, సన్నాఫ్ సత్తిమూర్తి సినిమాలు వచ్చాయి.

ఇప్పుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. అల్లు అర్జున్‌తో ముచ్చటగా మూడో సినిమా చేస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ పతాకాలపై ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాను ఎస్‌.రాధాకృష్ణ, అల్లు అరవింద్‌ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోయిన్‌గా పూజా ఛాన్స్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్-అల్లుఅర్జున్ కాంబోలో వచ్చిన రెండు సినిమాలు హిట్ అందుకోవడంతో ఇదే కాంబోలో రాబోతున్న ఈ మూడో సినిమాపైనా అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక అల్లు అర్జున్ అభిమానులైతే మరో హిట్ కాన్ఫామ్ అంటూ కామెంట్లు షేర్ చేస్తున్నారు.

pooja hegde, allu arjun, trivikram

----------------------------------------------------------------------------