11 April, 2019

nikhil-Lakshmi-Narayana

టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ పవన్ కళ్యాణ్ కి జైకొట్టాడు. జనసేన అధ్యక్షుడిగా ఆయన చేస్తున్న ప్రయత్నానికి మనస్ఫూర్తిగా హ్యాట్సాఫ్ చెప్పాడు. డిఫరెంట్ స్టోరీ లైన్స్‌తో కూడిన సినిమాలు మాత్రమే చేస్తూ యూత్‌లో స్పెషల్ ఫాలోయింగ్ కూడగట్టుకున్న యువహీరో. తన సినిమాల్లో అప్పుడప్పుడూ పవన్ కళ్యాణ్ పేరునో, ఫోటోను ప్రస్తావనకు పెట్టుకుని పవర్ స్టార్ క్రేజ్‌ని ఆ విధంగా కూడా క్యాష్ చేసుకున్న ఈ కిర్రాక్ స్టార్.. ఆ రుణాన్ని ఎలాగోలా తీర్చుకోవాలనుకున్నాడు. అందుకే జనసేనలో చేరకపోయినా.. జనసేనకు అంతోఇంతో చేద్దామన్న కమిట్మెంట్‌తో ఒక చిన్న ఎక్స్‌పరిమెంట్ చేసుకున్నాడు.

”నిన్ననే కొంతమంది జనసైనికుల్ని కలిశా. విశాఖ యువ ఎమ్మెల్యే అభ్యర్థి సందీప్‌తో కూడా మాట్లాడా..! పోటీలో నిలబడి ఒక్క పైసా కూడా ఖర్చుపెట్టకుండా గెలవాలన్న పట్టుదలతో వున్నాడు. ఇటువంటి సామాన్యులు, మచ్చ లేనివాళ్లు, గౌరవప్రదమైన నేపథ్యం వున్నవాళ్లు కూడా చట్టసభల్లోకెళ్లే అవకాశం రావడం నిజంగా గొప్ప విషయం..” అంటూ కితాబునిచ్చాడు నిఖిల్.

పవర్ స్టార్‌కి జిందాబాద్ కొట్టిన అతికొద్ది మంది టాలీవుడ్ సెలబ్రిటీల్లో ఒకడుగా నిలిచాడు ఈ బుడ్డ హీరో! విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీలో వున్న సీబీఐ మాజీ అధికారి లక్ష్మీనారాయణను కలిసి మద్దతు తెలిపాడు నిఖిల్. ఇటు.. తెలంగాణలో ఒక తెరాస అభ్యర్థిని కూడా ప్రమోట్ చేస్తున్నాడు. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తలసాని సాయికిరణ్ యాదవ్ కోసం ప్రచారం చేశాడు నిఖిల్.

----------------------------------------------------------------------------

nikhil siddhardh, janasena support, trs support

----------------------------------------------------------------------------