11 April, 2019

Kumara-swamy

కర్ణాటక ముఖ్యమంత్రి మిగతా వాళ్లకంటే డిఫరెంట్ కామెంట్లతో వార్తల్లోకి వస్తుంటారు. ఆయన నోటి నుంచి వచ్చే కామెంట్లను సాధారణంగా ఇతర సీఎంల నుంచి వినపడటం అరుదే. గతంలో రెండుమూడు సార్లు ఏడ్చి వార్తల్లోకి ఎక్కాడు. ఆ తర్వాత నా సీఎం సీటుకు గ్యారంటీ లేదు అన్నాడు. ఇలా వెరైటీ కామెంట్లు చేయడంలో ఆయన దిట్ట. తాజాగా మోడీపై ఆయన చేసిన కామెంట్లు ట్రోలర్లకు టన్నుల కొద్దీ ఆనందాన్ని పంచుతున్నాయి.

మోడీ ఎందుకు ఎపుడూ వార్తల్లో ఉంటారనే దానికి కుమారస్వామి తనదైన శైలిలో జవాబిచ్చి వార్తల్లోకి ఎక్కారు. ప్రతిరోజూ పొద్దున లేచిన వెంటనే మోడీ మేకప్ వేస్తారట. అది కూడా వాక్స్ వాడి బాగా మెరిసిపోయేలా మేకప్ వేస్తారట. దీనివల్ల నరేంద్రమోడీ మొహం తళతళా మెరుస్తుంది. అలా చక్కగా తయారై కెమెరాల ముందుకు వస్తారట మోడీ. అందుకే మీడియా కూడా ఆయన ఫొటోల కోసం ఎగబడుతోందట. మరి మాలాంటి ఇతర నాయకుల ఫొటోలు ఎందుకు పెద్దగా పేపర్లో రావు అంటే... పొద్దున లేచి స్నానం చేసినపుడు మాత్రమే మొహం కడుక్కుంటారట. ఇంక మళ్లీ మొహం కడుక్కునేది మరుసటి రోజు ఉదయమేనట. అందుకే మా మొహాలు అంత ఆకర్షణీయంగా ఉండవు. వ్యాక్స్ వల్ల మోడీది మొహం మెరుస్తూ ఫొటోలకు బాగుంటుంది అని వివరించారు కుమారస్వామి.

----------------------------------------------------------------------------

kumara swamy, modi make up, funny comment

----------------------------------------------------------------------------