01 February, 2019

KCR-Pawan-kalyan-12

రాబోయే ఎన్నిక‌ల నాటికి ప‌వ‌న్, జగ‌న్‌ల మ‌ధ్య ఒక అవ‌గాహ‌న కుద‌ర‌బోతోందా..? అందుకు తొలి అడుగులు ప‌డుతున్నాయా? అంటే అవున‌నే అంటున్నాయి టిఆర్‌ఎస్‌ వ‌ర్గాలు. ఈ రెండు ఆంధ్రా పార్టీల మ‌ధ్య తెలంగాణా అధికార పార్టీ కీల‌క‌పాత్ర పోషిస్తోంద‌ట‌. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇవ్వాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్న తెరాస అధినేత కేసీఆర్.. అందుకు త‌గినవిధంగా పావులు క‌దుపుతున్న‌ట్టు స‌మాచారం.

ప‌వ‌న్ జ‌గ‌న్ విడివిడిగా పోటీ చేస్తే ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీలిపోయి.. చివ‌రికి అది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారే ‘ప్రమాదం’ ఉంద‌ని భావించిన కేసీఆర్.. ఎలాగైనా వీరిద్ద‌రినీ ద‌గ్గ‌ర చేయాల‌ని చూస్తున్నార‌ట‌. అందుకోసం మొన్న‌టి రోజున రాజ్‌భ‌వ‌న్ వేదిక‌గా ప‌వ‌న్‌తో తొలివిడ‌త‌గా కొంత చ‌ర్చ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఈ చ‌ర్చ‌ల కొన‌సాగింపుగా బీజేపీకి, కాంగ్రెస్‌కు స‌మ‌దూరంలో ఉన్నాన‌ని చెబుతున్న‌ ప‌వ‌న్‌ని ముందుగా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌లోకి తీసుకురావాల‌ని కేసీఆర్ భావిస్తున్నారు. ఆ త‌ర్వాత.. ఇప్ప‌టికే ఫ్రంట్‌లో చేర‌డానికి సుముఖంగా ఉన్న జ‌గ‌న్ పార్టీకి, ప‌వ‌న్ పార్టీకి దోస్తీ ఆటోమేటిక్‌గా కుదిరిపోతుంద‌న్న‌ది తెరాస ఎత్తుగ‌డ‌గా ప్ర‌చారం జ‌రుగుతోంది.

hema, director trivikram, controversy

----------------------------------------------------------------------------