07 March, 2019

kasturi-karthie-selfie

చెన్నైలో జరిగిన ‘జులై కాట్రిల్‌’ అనే మూవీ ఆడియో లాంచ్‌ వేడుక హాట్ హాట్ అయింది. హీరో కార్తి చీఫ్ గెస్ట్ గా హాజరైన ఈ ఫంక్షన్ కు సినీనటి కస్తూరి యాంకర్ గా వ్యవహరించారు. కార్తీ మాట్లాడాలంటూ వేదిక మీదకు పిలిచింది కస్తూరి. అయితే, ఈ క్రమంలో కార్తీతో సెల్ఫీ దిగుతానని మైక్ లో చెప్పిన కస్తూరి.. తీరా అతని దగ్గరకు వెళ్లి ‘మీ నాన్న లేరు కదా.. రండి ఓ సెల్ఫీ దిగుదాం’ అనేసింది. దీంతో కార్తికి ఎక్కడో తగిలింది. కోపాన్ని ఆపుకున్న కార్తీ సెల్ఫీ దిగడానికి ఒప్పుకోకుండా నేరుగా స్టేజ్‌పై ఉన్న మైక్‌ స్టాండ్‌ వద్దకు వచ్చారు. ‘అనుమతి లేకుండా ఓ సెలబ్రిటీతో సెల్ఫీలు దిగేస్తే ఎంత అమర్యాదకరంగా ఉంటుందో కొంతమందికి తెలీదంటూ క్లాస్ అందుకున్నారు.

ఫోన్‌ నుంచి వెలువడే ఫ్లాష్‌లైట్‌ వల్ల మైగ్రేన్‌ సమస్య ఉన్నవారికి చాలా ఇబ్బందులు కలుగుతాయంటూ లఘించుకున్నారు. ఆ తర్వాత కస్తూరి తేరుకుని ‘అభిమానులు సెలబ్రిటీలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి’ అంటూ స్టేజ్ మీద కవరింగ్ ఇచ్చుకున్నారు. ఇలాఉండగా, కొన్ని నెలల క్రితం కార్తీ తండ్రి శివకుమార్‌ ఓ కార్యక్రమానికి వెళుతుండగా అభిమానులు ఆయనను చుట్టుముట్టారు. ఆ సమయంలో ఓ యువకుడు సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా శివకుమార్‌కు కోపం వచ్చి ఫోన్‌ను విసిరికొట్టారు. ఈ ఘటన కాస్తా అప్పట్లో చర్చనీయాంశమైంది కూడా. ఆ సందర్భాన్ని కస్తూరి మరోసారి గుర్తు చేయడమే కార్తీ కోపానికి కారణమైంది.

kasturi, karthie, selfie controversy

----------------------------------------------------------------------------