01 February, 2019

hema-telugu

టాలీవుడ్ నటి హేమ ఓ డైరెక్టర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తన రెమ్యూనరేషన్ డిసైడ్ చేయడానికి ఆయన ఎవరంటూ రుసరుసలాడింది. ఇంతకీ హేమకు-త్రివిక్రమ్‌కు ఎక్కడ చెడింది? ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసింది. ఇండస్ర్టీలో టాప్ మోస్ట్ డైరెక్టర్లు తన ఫ్రెండ్స్ అని చెప్పిన నటి హేమ, తన కోసం థియేటర్లు వచ్చే ఆడియన్స్ వుంటారని, ఆ విషయం డైరెక్టర్లు కూడా తెలుసని తెలిపింది. సంక్రాంతికి వచ్చిన ‘వినయ విధేయ రామ’తో మరోసారి నిరూపించానని గుర్తు చేసుకుంది. ఇదే క్రమంలో తనకు రెమ్యూనరేషన్ పెంచలేదని మనసులోని మాట బయటపెట్టింది హేమ.

త్రివిక్రమ్ సినిమాల్లో ఎందుకు కనిపించలేదని అడిగిన ప్రశ్నకు వెరైటీగా రిప్లై ఇచ్చింది. తన రెమ్యూనరేషన్ డిసైడ్ చేయడానికి అతనెవరు? ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది మేనేజర్ లేదంటే ప్రొడ్యూసర్ వుంటారని తెలిపింది. ఇన్నేళ్లు మీతో ట్రావెల్ చేసిన తనను నమ్మలేదని, కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుందని సైలెంట్ అయిపోయానని వెల్లడించింది. దీంతో ఆయనతో మాట్లాడడం మానేశానని తెలియజేసింది. మరి హేమ వ్యాఖ్యలపై మాటల మాంత్రికుడు ఏమంటాడో చూడాలి.

hema, director trivikram, controversy

----------------------------------------------------------------------------