01 February, 2019

mr-majnu-12

అక్కినేని అఖిల్ హ్యాట్రిక్ కొట్టేసినట్లే ఉన్నాడు. ఈ హ్యాట్రిక్ హిట్లలో అయితే అందరికీ సంతోషమే. కానీ అతను మూడు వరుస ఫ్లాపులు ఖాతాలో వేసుకున్నాడు. ‘అఖిల్’ సినిమా చెత్త కాబట్టి.. అది డిజాస్టర్ కావడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘హలో’ కూడా డిజాస్టర్‌గానే మిగిలింది.

తాజాగా ‘మిస్టర్ మజ్ను’కు నెగెటివ్ టాక్ ఏమీ లేదు. ఫుల్ పాజిటివ్ టాక్ రాకపోయినా చూసిన వాళ్లందరూ పర్వాలేదనే అన్నారు. రివ్యూలు మోడరేట్‌గా వచ్చాయి. ఈ మాత్రం టాక్‌తో సినిమా ఎంతో కొంత సర్వైవ్ కావాలి. బ్రేక్ ఈవెన్‌కు దగ్గరగా వెళ్లాలి. కానీ పరిస్థితి చూస్తుంటే ‘మిస్టర్ మజ్ను’ 60 శాతం రికవరీతో సరిపెట్టేలా కనిపిస్తోంది. కాబట్టి అఖిల్ ఖాతాలో మరో ఫెయిల్యూర్ పడ్డట్లే.

ఒక కొత్త హీరోకు వరుసగా రెండు ఫ్లాపులు పడితే.. మూడో సినిమాకు వచ్చేసరికి అతడి విషయంలో ప్రేక్షకుల్లో కొంత సానుభూతి ఉంటుంది. ఆ ఫ్యాక్టర్ సినిమాకు కలిసి రావాలి. కానీ అఖిల్ విషయంలో అలాంటిదేమీ జరగలేదు. తొలి సినిమా విడుదలకు ముందు.. చేసిన అతే అతడికి చేటుగా మారిందన్నది స్పష్టం.

కాబోయే సూపర్ స్టార్ అన్నట్లుగా అతడిని ప్రొజెక్ట్ చేశారు అక్కినేని కుటుంబ సభ్యులు, అభిమానులు. ముందే నేషనల్ లెవెల్లో బ్రాండ్లకు ప్రచారం చేయించారు. ‘అఖిల్’ సినిమా విషయంలోనూ హడావుడి మామూలుగా లేదు. భారీ బడ్జెట్ పెట్టారు. హెవీగా ప్రమోట్ చేశారు. అఖిల్ సైతం కొత్త కుర్రాడిలా కాకుండా ఎస్టాబ్లిష్ స్టార్ లాగా బిహేవ్ చేశాడు. కాన్ఫిడెన్స్ చూపించే క్రమంలో యారొగెంట్ అన్న ముద్ర వేయించుకున్నాడు.

ఇది సినిమా రిలీజ్ తర్వాత ప్రతికూలంగా మారింది. అఖిల్ తొలి సినిమా పోయిందే అన్న బాధ సామాన్య ప్రేక్షకుల్లో కలగలేదు. ఈ ప్రభావం తర్వాతి సినిమాల విషయంలోనూ కొనసాగింది. ‘హలో’ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ఆడలేదంటే.. అతడిపై ప్రేక్షకుల్లో ఎంత నెగెటివిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ‘మిస్టర్ మజ్ను’ విషయంలోనూ ఈ ఒరవడి కొనసాగినట్లే కనిపిస్తోంది.

సంక్రాంతి సినిమాల్లో ఒక్క ‘ఎఫ్-2’ మాత్రమే ఆడుతుండగా.. ప్రేక్షకులకు ఉన్న సెకండ్ ఛాయిస్ ‘మిస్టర్ మజ్ను’ మాత్రమే. దీనికి వచ్చిన టాక్ ప్రకారం బాగా ఆడాలి. కానీ జనాలు అఖిల్ సినిమా చూసేందుకు అంతగా ఆసక్తి చూపించలేదు. మరి హ్యాట్రిక్ ఫ్లాపులు ఎదురైన నేపథ్యంలో ఇకనైనా ప్రేక్షకులకు అఖిల్ మీద నెగెటివిటీ తగ్గి సానుభూతి వచ్చి తర్వాతి సినిమా విషయంలో కరుణిస్తారేమో చూడాలి.

akhil akkineni, mr majnu, bad collections

----------------------------------------------------------------------------