February 11, 2018

advani-18-2-11

ఏపీ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికని చెప్పనంటూ తన నిస్సహాయతను ప్రదర్శించారు. టీడీపీ నమ్మకమైన మిత్రపక్షమని.. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పార్టీపై మరింత శ్రద్ధ ఉంచాల్సిన అవసరం ఉందని అద్వానీ అన్నారు. రాష్ట్రవిభజన సమయంలో ఆంధ్రకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందేనన్నారు. మీ పోరాటంలో తప్పు లేదు.. కానీ సభ గౌరవమూ ముఖ్యమేనని టీడీపీ ఎంపీలతో అద్వానీ చెప్పారు.

నిన్న రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడ్డంతో సభ్యులంతా నిష్క్రమిస్తున్న తరుణంలో ఆద్వానీ తన సీటులోనే ఉండడాన్ని గమనించిన టీడీపీ ఎంపీలు కె.రామ్మోహన్‌నాయుడు, రవీంద్రబాబు, మురళీమోహన్‌, మాల్యాద్రి, అవంతి శ్రీనివాస్‌ ఆయన వద్దకు వెళ్లారు. అద్వానీకి తమగోడు వివరించారు. మీ ఆవేదనలో అర్థముందంటూ చెప్పిన అద్వానీ.. అయినా తను ఎవరికని చెప్పనంటూ.. తన మాట వినేదెవరనే నిస్సహాయతను ప్రదర్శించారు.