First-look-of-Vidya-Balan-begum-jaan

ప్రముఖ బాలీవుడ్ నటి విద్యా బాలన్ త్వరలో 'బేగమ్ జాన్' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ బెంగాలీ డైరెక్టర్ శ్రీజిత్ ముఖర్జీ ఈ సినిమా ద్వారా బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు. శ్రీజిత్ ముఖర్జీ బెంగాలీలో తెరకెక్కించిన రాజ్‌కహిని సినిమాను హిందీలో 'బేగమ్ జాన్'గా రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి విద్యా బాలన్ ఫస్ట్ లుక్ స్టిల్ ఒకటి ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. విద్యా బాలన్ హుక్కా తాగుతూ ఉన్న ఈ ఫోటో హాట్ టాపిక్ అయింది.

1947లో భారత దేశ విభజన సమయంలో పంజాబ్ లో బ్రోతల్ హౌస్ నడిపిన ఓ మహిళ పాత్రే ఈ బేగమ్ జాన్. 'బేగమ్ జాన్' చిత్రంలో విద్యా బాలన్ తో పాటు గుహర్ ఖాన్, పల్లవి శార్దా, ఇలా అరుణ్ తదితరులు నటిస్తున్నారు. గతంలో విద్యా బాలన్ నటించిన 'డర్టీ పిక్చర్' అప్పట్లో సంచలనం. టైటిల్‌కి తగ్గట్టే ఆ చిత్రం చాలా డర్జీగా ఉందనే విమర్శలు వచ్చాయి. ఇపుడు 'బేగమ్ జాన్' ఫోటో చూసిన తర్వాత సినిమా అంతకంటే డర్జీగా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. మార్చిలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.