varalakshmi-with-simbu-now

తమిళ హీరోయిన్ వరలక్ష్మి అంటే తెలుసా? ఈ పేరు చెబితే ఎవరికీ తెలియదు ... కానీ హారో విశాల్ లవర్ అంటే మాత్రం అందరు గుర్తు పడతారు? స్టార్ హీరో శరత్ కుమార్ కుమార్తె గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ విశాల్ లవర్ గానే పాపులర్ అయింది. ఈ మధ్య విశాల్, వరలక్ష్మి ల మధ్య ఎందుకు చెడిందో తెలియాదు కానీ ఇద్దరి మధ్య దూరం బాగా పెరిగింది. లేటెస్ట్ గా వరలక్ష్మి ...

శింబు ఇచ్చిన విందులో పాల్గొని అతనితో కలిసి చిందులు వేయడం అందరికి షాక్ ఇచ్చింది. పైగా ఈ కార్యక్రమంలో మరో హాట్ భామ త్రిష కూడా పాల్గొంది. విశాల్ బ్రేక్ అప్ తరువాత వరలక్ష్మి శింబుతో అంత క్లోజ్ గా ఉండడం .. ఆసక్తిని రేకెత్తిస్తుంది. నడిగర్ సంగం విషయంలో కూడా శింబు, విశాల్ కు అపోజిట్ గానే ఉన్నాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వరలక్ష్మి కూడా శింబుతో ఉండడం చర్చలకు దారి తీస్తోంది !!

ఈ మధ్య జరిగిన నడిగర్‌సంఘం ఎన్నికల సమయంలో విశాల్ వ్యతిరేక వర్గానికి శింబు మద్దతునిచ్చిన విషయం తెలిసిందే. న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌ల త‌ర్వాత విశాల్ ఒక్క‌సారిగా త‌మిళంతో పాటు సౌత్‌లో సూప‌ర్ పాపుల‌ర్ అయ్యాడు. కోలీవుడ్ సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మీతో విశాల్ ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాడని వార్తలు వెలువడ్డాయి.

దీంతో విశాల్‌-వ‌ర‌ల‌క్ష్మి జంట త్వరలో ఒక్కటవబోతోందని అందరూ చెవులు కొరుక్కున్నారు. ఈ సమయంలో మీడియా ముందుకు వచ్చిన వరలక్ష్మీ.. తన ప్రేమ, పెళ్లి గురించి వస్తున్న వార్తలు మొత్తం అబద్ధాలని, తన ప్రేమ, పెళ్లి అంతా సినిమాతోనే అని చెప్పుకొచ్చింది.

ఎక్క‌ువ కాలం ప్రేమించుకుంటుంటే... ఆ ప్రేమ పెళ్ళి వ‌ర‌కు చేర‌దంటారు... విశాల్, వ‌ర‌ల‌క్ష్మిల విష‌యంలో ఇదే జ‌రిగిన‌ట్లుంది. తమిళ స్టార్ హీరో విశాల్, వ‌ర‌ల‌క్ష్మిల ప్రేమాయ‌ణం కథ కంచికి చేరినట్టుంది. శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి, విశాల్ లు గత ఏడేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. ఆ మధ్య తమిళ నడిఘర్ సంఘం నిర్మించే పెళ్ళి మంటపంలో మొట్టమొదటి పెళ్ళి మాదే అని విశాల్ ప్రకటించాడు.

అయితే ఇప్పుడు వరలక్ష్మి తన ట్విట్టర్ ఖాతాలో ఏడేళ్ళ బంధాన్ని ఓ వ్యక్తి తేలికగా తీసుకుంటున్నాడని, ప్రేమ పరిహాసంగా మారుతోందని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌తో ఇక విశాల్, వరలక్ష్మి ప్రేమకథకి ముగింపు అనుకున్నారంతా. కానీ, ఇది కేవలం ట్వీట్ మాత్రమే. ప్రస్తుతం నేను వర్క్ మీద దృష్టి పెడుతున్నాను అని మళ్ళీ ట్వీట్ చేసింది వరలక్ష్మి.

విశాల్‌-వ‌ర‌ల‌క్ష్మీ ప్రేమ వ్య‌వ‌హారం శ‌ర‌త్‌కుమార్‌కు న‌చ్చ‌క‌పోవ‌డం వ‌ల్లే వీరిద్ద‌రి మ‌ధ్య మాటా మాటా పెరిగి చివ‌ర‌కు అది న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌ల్లో విశాల్ శ‌ర‌త్‌కుమార్‌పై స‌వాల్ చేసే స్థాయి వ‌ర‌కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. అక్కడితోనే ఈ ప్రేమికుల మధ్య కూడా దూరం పెరగటం మొదలయ్యింది. విశాల్ సరిగ్గనే ఉన్నా తండ్రి సైడ్ తీసుకున్న వరలక్ష్మి మాత్రం ఇక ఈ బందానికి ఫుల్స్టాప్ పెట్టాల్సిందే అని నిర్ణయించుకుండంటూ వార్తలు వచ్చాయి.

ఇదిలా వుంటే, 'నా ప్రేమకు పుట్టినరోజు శుభాకాంక్షలు..' అంటూ వరలక్ష్మి, సోషల్‌ మీడియాలో విశాల్‌ని ఉద్దేశించి పోస్ట్‌ చేయడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. ఎందుకంటే, మొన్నీమధ్యనే 'ప్రేమకి టైమ్‌ లేదు.. కెరీర్‌లో బిజీగా వున్నాను.. అసలు పెళ్ళి మాటే లేదు..' అని ఈ మధ్యనే మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఘాటుగా సమాధానమిచ్చింది. ఇక అప్పుడు అందరి కళ్ళూ తెరుచుకున్నాయి వీళ్ళ బ్రేకప్ నిజమే అని అందరికీ అర్థమైపోయింది.