Bahubali-gauthamiputra-17

బాలకృష్ణ వందో సినిమాగా అందరి దృష్టిని ఆకర్షించిన శాతకర్ణి, విడుదలయ్యాక మాత్రం మొత్తం దృశ్యం మారిపోయింది. ఈ సినిమాను ఇప్పుడు బాలయ్య సినిమా కంటే కూడా “క్రిష్” సినిమాగా చూస్తున్నారు. అయితే శాతకర్ణి సినిమా రాజమౌళిని “టార్గెట్” చేయటం సరికొత్త అంశంగా మారింది. సినిమాను చూసి బయటకు వచ్చినోళ్లంతా అన్నేసి సంవత్సరాలుసినిమా తీయాల్సిన అవసరం ఉందా? అన్నేళ్లు చెక్కేసి తీసిన బాహుబలికి కేవలం 79 రోజుల్లో షూటింగ్ ముగించిన శాతకర్ణికి మధ్య పెద్ద తేడా ఏమి ఉందన్న మాటలు విమర్శలుగా మారాయి.

సినిమా అంటే ప్రణాళికా బద్ధంగా తక్కువ సమయంలో తీయాలి. అలా తీస్తే తక్కువ బడ్జెట్ తో పూర్తయి, నిరీక్షణ తప్పి పోతాయి. ఏళ్ల తరబడి చేయటం సరి కాదన్న మాట ఇప్పుడు రాజమౌళికి ఇబ్బందిగా మారింది. ఆసక్తికరమైన అంశం ఏమంటే, శాతకర్ణికి, రాజమౌళికి ఏ మాత్రం సంబంధం లేకున్నా- ఇప్పుడు మాత్రం అందరికి రాజమౌళి టార్గెట్ అయ్యారనే చెప్పాలి. బాహుబలిని అన్నేసి సంవత్సరాలు తీయటాన్ని తమ మధ్య చర్చల్లో ప్రశ్నిస్తున్న వైనం చూసినప్పుడు, శాతకర్ణితో రాజమౌళికి సరికొత్త తలనొప్పి తెచ్చినదనటములో సందేహం లేదు.

వ్రాత కోసమే ఐతే మనం రూ.10/- పెట్టి కొన్న రేనాల్డ్స్ వాడుకోవచ్చు. కాని వేల, లక్షల ఖరీదు చేసే మాంట్-బ్లాంక్ పెన్ను కూడా అదేపని చేసినా, దీనికి ఉన్న సామాజిక హుందాతనం మాత్రం అత్యంత అధికం. నిజం చెప్పాలంటే అదే భేదం ఉంది - 'క్రిష్ గారి గౌతమిపుత్ర శాతకర్ణికి - రాజమౌళి గారి బాహుబలీ మధ్య. 79 రోజుల్లో 60 కోట్ల రూపాయలు వెచ్చించి తీసిన శాతకర్ణి లో బాహుబలిలోని సజీవ దృశ్యాలు హిమోన్నతాలపై జాలువారే జలపాతాలు, జారిపడి ఎగిరిపడే కథానాయకుని సాహసోపేత విన్యాసాలు కనిపించవు. శాతకర్ణిలో లాగా ఒకే వ్యక్తి కెకలు అరుపులతో కూడిన ఒకే దృశ్యం లో ఒకే నేపధ్యం ఉంటుంది.

అదే బాహుబలి లో నేపద్యమంతా బహుళ స్వభావాల దృశ్యాలు ఒకేసారి దృశ్యాల సమాహారంగా కనిపిస్తుంది. అలాంటి అనేకదృశ్యాలు మన కనులను ఒక్క క్షణం రెప్ప వాల్చ నివ్వవు. ప్రతి పాత్రా తన సమక్షాన్ని ప్రేక్షకుల కనుసన్నలలో నిలిచి పోయేలా చేస్తుంది. అలాంటి పాత్రలు చాలా ఉన్నా ప్రతి పాత్రా మనలను వదలి పోవు.

శివుడు (మహెంద్ర బాహుబలి - అమరెంద్ర బాహుబలి), భల్లాల దేవ, దేవసెన, అవంతిక, శివగామి, కట్టప్ప, బిజ్జలదేవ, సంగ, శ్వామి, భద్ర, కాలకెయ రాజు, అస్లాం ఖాన్ ఇలా ప్రతి పాత్రా తీర్చిదిద్దబడి మన మనోపలకాలపై ముద్రించబడ్డాయి. అద్భుతంగా ఒక్కో దృశ్యం ఒక చిత్రకారుడు వేసిన చిత్రంలా రాణిస్తాయి. వాతావరణం లోనే శబ్ధం, దృశ్యం మిళితమైన ఒక సమ్మోహనత్వం ఇవన్నీ మరి ఇన్ని డిటైల్స్ గౌతమిపుత్ర శాతకర్ణి లో చూడగలమా? 5 ప్రముఖపాత్రలు మాత్రమే చెప్పుకోవచ్చు. ఒక సన్ని వేశానికి ఒకే నేపద్య దృశ్యం, బహుళ దృశ్యాలు ఒక్కసారిగా నేపధ్యం లో ఎక్కడా కనిపించవు. అన్నింటి నీ మించి మాహిష్మతి నగర సౌందర్యం.

జలపాతాలపైకి శివుడు దూసుకు వెళ్ళే దృశ్యం, వంద అడుగుల విగ్రహాన్ని నిలబెట్టడం దానికి వాడిన పుల్లీ సిస్టం, అక్కడ సైనికులు, ప్రజలు పడిన వేదనా భరిత దృశ్యం, మంచుకొండల్లో మంచు తుఫాను, మంచు పర్వతాల పై యుద్ధం, ఇలాంటి ఎన్నో దృశ్యాలు మన కనులముందే కదలిపోతున్న ఆ అనుభూతి ఇంతకుముందు మనం ఏ ఇతర భారతీయ సినిమాల్లోనైనా చూశామా? ఇవన్నీ తీయాలంటే ఇంత గొప్పగా సమయం పడుతుంది కదా! దాన్ని విమర్శకులు గుర్తించాలి. అంటే కాదు బాహుబలి జానపద చిత్రం అంటే ఫాంటసి. అంటే "కలగనే వాడి కళ్ళ ముందున్న కలల రాజ్యం" రుద్రమదేవి చారిత్రాత్మకం. రుద్రమదేవి విషయంలో కూడా ఇలాగే జరిగినా! ఆ సినిమాలో ఇంత క్వాలిటీ రాలేదు కారణం బడ్జెట్. గుణశేఖర్ కూడా ఒక అద్భుత దర్శకుడే.

శాతకర్ణి దర్శకుడు క్రిష్ ఉన్నత స్థాయి దర్శకుడు కావటమే ఈ సినిమా అంత విజయం సాధించింది. ఈ ముగ్గురు కాకుండా మరెవరైనా శాతకర్ణి ఈ స్టార్-కాస్ట్ తో తీసినా అట్టర్ ఫ్లాప్ అయి ఉండేది. శాతకర్ణి ఇంత అద్భుత నిజయం సాధించటానికి బాహుబలి ముఖ్యకారణం. బాహుబలి విడుదలైంది ప్రేక్షకులు సినిమాస్ కు తరలివెళ్ళటం ప్రారంభమైంది. నాడు మాయబజార్, శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం, దాన వీర శూర కర్ణ సినిమాలకు ఇలాగే వెళ్ళేవారు ప్రేక్షకులు. చిరంజీని మాత్రమే కొన్ని సినిమాలకు జనాలని ఇల తీసుకు రాగలిగారు. రెండుదశాబ్ధాల పాటు మన ప్రేక్షకుల చూపు బుల్లితెర కి పరిమితమయ్యాయి. మార్కెట్ మొత్తం సంకోచించుకు పోయింది. అలాంటి ధైన్య స్థితిని బహుబలి తప్పించారు. ఆయన బాహుబలి బ్రహ్మాండ విజయం మార్కెట్లను వ్యాకోచపరచింది. ఆ మార్పు ఈ మధ్య ఆనవాయితీగా మారి ఖైది నంబర్ 150 గాని, గౌతమిపుత్ర శాతకర్ణి గాని ఇంత విజయం సాధించాయి. అద్భుత విజయాలకు పినాది రాళ్ళేకాదు, రహదారులు వేసిందీ రాజమౌళి గారి బాహుబలే.

"బాహుబలి" మన భారతీయ సినిమా స్థాయిని, సత్తని, ధైత్యాన్ని, పెన్చిన సినిమా. అత్యంత నాణ్యమైన గ్రాఫిక్స్ , అద్భుతమైన క్యారెక్టరైజేషన్ , ప్రతిపాత్రకి తగిన ప్రాతి నిధ్యం, నటీనటుల ఎంపిక, పరవసించే ప్రకృతి నేపధ్యం - ఇవన్నీ కలిసిన మన తెలుగు సినిమా దేశంలో అత్యున్నత కలక్షన్లు సాధించినగా నిలిచింది.

కొంతమందిలి రాజమౌళి కి బడ్జెట్ బాగా ఇచ్చారు కాబట్టి తీసారు అంటారు. అనే వాదనలో అంత పట్టున్నట్లు లేదు, ఎందుకంటే రాజమౌళి కాబట్టేఅ అంత బడ్జెత్ కావలసి వచ్చిందంటాను. ఏ సినిమా కైనా బడ్జెట్ అనేది ఆ దర్శకుడి సామర్ష్యం, కథానాయకుని మార్కెట్ ను బట్టి పెడతారు. బాహుబలి కి అంత బడ్జెట్ నిర్మాతలు పెట్టారంటే అంటే కారణం, వైఫల్యాలు లేని ఆయన వరుస 9 హిట్ల్ర అదే ఆయన స్వంతంగా నిర్మించుకున్న రాజమౌళి ట్రాక్ రికార్డ్ మాత్రమే. ఒక ప్రభాస్ ను, ఒక రానా ను రాజమౌళి రాజరిక లక్షణాలతో సంతులితం చేశారు. అంటే పాత్రల సృష్టేకాదు పాత్రధారులలో సర్వ లక్షణ సృష్టి చేశారు - అంతటితో అయిపోలేదు ఆయన తగిన ప్రకృతిని, వాతావరణాన్ని సృష్ఠించారు. దానికి కావలసింది సహనం, విజ్ఞానం, సుదూర దృష్టి, భవిష్యత్లోకి తనను తన సినిమాను తీసుకెళ్ళే సామర్ధ్యం ఉన్న దర్శకత్వ ప్రజ్ఞ. అవన్ని పుష్కలంగా ఉన్నవారు రాజమౌళి. మరొకరు ఆ స్థాయికి చేరటానికి మనసా, వాచా, కర్మణా ప్రయత్నిస్తే ఒక దశాబ్ధ కాలం పట్టవచ్చు.

చింతించాల్సిందే మంటే "శాతకర్ణి కథలో శాలివాహనుని కథ కలిపిన ఫాంటసి" ని, "ఆంధ్ర శాతకర్ణి" రారాజు గా శకపురుషునిగా వక్రీకరించటం, చారిత్రాత్మకం అనిచెప్పి ప్రయోజనాలు పొందటం మాత్రం క్షమించరానివి. అంతకు మించి చెప్పాలంటే ఇదొక బాహుబలి లాంటి దర్శకత్వ విజయం అని చెప్పవచ్చు. అంతే కాని రాజమౌళికి క్రిష్ కి - బాహుబలికి గౌతమిపుత్ర శాతకర్ణి కి - భేదం హస్తి మశాంతకం అంత. అంటే ఏనుగుకి దోమకున్నంత.