roja-somireddy-16-11-24

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే, మహిళా నాయకురాలు రోజా పైన తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బుధవారం నాడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె నోటి నుంచి రేప్ అనే మాట తప్ప మరొకటి రాదన్నారు.

నెల్లూరులో జనచైతన్య యాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రోజా శాసన సభను జరగనీయరన్నారు. అసెంబ్లీలో అసభ్యకరమైన పదజాలంతో టిడిపి ఎమ్మెల్యేలను ఆమె దూషించిందన్నారు. ఆమె నుంచి రేప్ అనే మాట తప్ప మరొకటి రాదన్నారు. ఆడ మనిషి, ఎమ్మెల్యే అయి ఉండి రేప్ చేసే మగాడు ఉన్నాడా అని అడగడం విడ్డూరమన్నారు.

ఈ రాష్ట్ర చరిత్రలో ఇలాంటిది ఎప్పుడైనా, ఎక్కడైనా జరిగిందా అన్నారు. కనీసం వార్డు మెంబర్ అయినా ఈ భాషను మాట్లాడుతారా అన్నారు. ఏమైనా అంటే రేప్ చేస్తావా అని అడగడం ఏమిటన్నారు.