February 11, 2018

sivaji-arun-jaitley

రాష్ట్ర విభజన అనంతరం ఏపీని అన్నివిధాల ఆదుకుంటామని చెప్పిన కేంద్రం చివరి బడ్జెట్ లోనూ ఏపీ ఊసు తీయకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా షాక్ తిన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన దాదాపు అన్ని పార్టీల ఎంపీలు కేంద్రంపై నిప్పులు చెరుగుతున్నారు. గత ఐదు రోజులుగా పార్లమెంట్ ఉభయసభల్లో తమ నిరసన వ్యక్తం చేశారు.

దీనికి చివరి రోజైన ఇవాళ కేంద్రమంత్రి జైట్లీ ఇచ్చిన సమాధానం చాలా మందిని నిరాశకు, ఆగ్రహానికి గురిచేసింది. ఎంపీల నిరసనను పట్టించుకోకుండా, దానిగురించి మాటైనా మాట్లాడకుండా జైట్లీ ముక్తసరి ప్రసంగం పై ఏపీ ప్రత్యేక హోదా సాధనసమితి అధ్యక్షులు.. నటుడు శివాజీ జైట్లీ ప్రసంగంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ‘ఏపీని నిండాముంచారు.. తెలుగోడిని తొక్కారు.. తెలుగుగోడి సంపదను పదిమంది గుజరాతీ వ్యాపారులకు దోచిపెడుతున్నారు.. భయపడదామా.. అంటూ తన ఆవేదన, ఆవేశాన్ని నటుడు శివాజీ ట్విట్టర్లో పేర్కొన్నారు.