etv-extra-jabardasth-comedy-show-16

తెలుగు టెలివిజన్ చరిత్రలో మోస్ట్ పాపులర్ షోగా పేరు తెచ్చుకోవడమే కాకుండా ఈ షోను ప్రారంభించి ఏళ్ళు గడిచి పోతున్నా రేటింగ్స్ విషయంలో ఇప్పటికీ సంచలనాలు సృట్టిస్తున్న ‘జబర్దస్త్’ కు ఊహించని షాక్ తగలబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రతి వారం గురు - శుక్రవారాలు వచ్చాయంటే చాలు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు చాలామంది ఈ ‘జబర్దస్త్’ ప్రోగ్రాంను ఎప్పటి నుంచో తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

ఒకవైపు ఈ కార్యాక్రమంలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ చాల ఎక్కువ అని కామెంట్స్ వస్తున్నా ఇవేమీ పట్టించుకోకుండా జనం ఈ కార్యక్రమాన్ని చూడకుండా ఉండలేక పోతున్నారు. దీనితో ఈ కార్యక్రమానికి రేటింగ్స్ విషయంలో ఎటువంటి లోటు ఏర్పడక పోవడంతో ఈ కార్యక్రమ నిర్మాతలకు లాభాల పంటలు పండుతున్నాయి.

టీవీలో వచ్చే ఒక కామెడీ కార్యక్రమానికి ఈ స్థాయిలో ఇలా ఆదరణ ఉంటుందని ఎవ్వరూ ఊహించలేదు. కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెడుతుండటంతో ఇదే తరహాలో ఈటీవీలో ఇంకా ఒకట్రెండు ప్రోగ్సామ్స్ మొదలయ్యాయి. అయితే ఈకార్యక్రమాలు ‘జబర్దస్త్’ స్థాయిలో విజయవంతం కాలేదు.

ఈ పరిస్థుతులు ఇలా ఉండగా బుల్లితెరకు సంబంధించిన మరో పెద్ద ఛానెల్ ‘జబర్దస్త్’ తరహాలోనే ఒక కార్యక్రమం మొదలుపెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సాధారణంగా ఇతర ఛానల్స్ లో ప్రసారం అయ్యే కార్యక్రమాలను కాపీ కొట్టి ఇంకో ప్రోగ్రాం తయారు చేయడం ఎప్పటి నుంచో ఉంది.

అయితే ‘జబర్దస్త్’ కార్యక్రమానికి జడ్జీలుగా వ్యవహరించే నాగబాబు – రోజా ల స్థాయికి తగ్గట్లుగా రమ్యకృష్ణ - పోసాని కృష్ణమురళీలను ఈ కొత్త ప్రోగ్రాంకు జడ్జీలుగా ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. అయితే పోసాని రమ్యకృష్ణల పై మంచి ఇమేజ్ ఉన్నా నాగబాబు రోజా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నడిపించి మెప్పించ గలరా ?