Nagarjuna-Balakrishna-16-12-05

యువ కథానాయకుడు అక్కినేని అఖిల్‌ నిశ్చితార్థం డిసెంబర్‌ 9వ తేదీన జరగనుంది. పారిశ్రామిక వేత్త సోమనాద్రి భూపాల్‌, షాలిని దంపతుల కుమార్తె కుమారి శ్రియతో అఖిల్‌ వివాహ నిశ్చితార్థం జరుగుతుంది. డిసెంబర్‌ 9వ తేదీ సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్‌లొని జివికె నివాసంలో ఈ కార్యక్రమం జరగనుందని అఖిల్‌ తండ్రి, ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున సన్నిహితులకు, బంధువులకు ఆహ్వానం పంపించారు. అఖిల్‌, శ్రియ కొద్దిరోజులుగా ప్రేమలో ఉన్నారు. ఇరు వైపుల పెద్దలు అంగీకరించడంతో నిశ్చితార్థ వేడుక జరుగనుంది. అయితే, ఈ శుభకార్యానికి ముఖ్యులెవరినీ నాగార్జున ఆహ్వానించలేదట.

కేవలం కొద్దిమంది ప్రముఖులనే ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు టాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి సాధారణంగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరవుతారని అందరూ ఊహించారు. కానీ, అందరి ఊహలను తలక్రిందులు చేస్తూ.. చిరంజీవి, కేసీఆర్, చంద్రబాబు నాయుడు, వెంకయ్యనాయుడు వంటి ప్రముఖులు మినహా మరెవ్వరూ ఈ కార్యక్రమానికి హాజరు కాబోవడం లేదని ఇండస్ట్రీ టాక్. ఈ వేడుక‌కు చాలా త‌క్కువ మంది అతిథుల‌కే ఆహ్వానాలు అందాయ‌ని స‌మాచారం. నాగ్ కుటుంబానికి అత్యంత‌ముఖ్యులైన సినీ, రాజ‌కీయ‌, వ్యాపార వ‌ర్గాల‌కు చెందిన వ్య‌క్తులే ఈ నిశ్చితార్థ వేడుక‌ల‌కు హాజ‌ర‌వుతార‌ని తెలుస్తోంది. అంతా పోగేస్తే అతిథుల సంఖ్య 40 నుంచి 50 వ‌ర‌కే ఉంటుంద‌ని తెలుస్తోంది. పెళ్లి కూడా ఇట‌లీలో చేసుకోబోతున్నాడు. దానికీ త‌క్కువ‌మందే హాజ‌ర‌వుతారు. అయితే రిసెప్ష‌న్ మాత్రం గ్రాండ్‌గా చేయాల‌ని నాగ్ భావిస్తున్నాడ‌ట‌.

ఇదిలా వుంటే హీరో బాలకృష్ణతో నాగ్ కు తెలియని విబేధాలున్నాయని గుసగుసలు వున్నాయి. వాటికి మరింత బలం చేకూర్చేలా, అఖిల్ ఎంగేజ్ మెంట్ ఫంక్షన్ కు బాలయ్యకు ఆహ్వానం అందలేదని విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఇంతకీ ఈ విభేదాలు ఎందుకు వచ్చాయి అంటే.. ఖచ్చితంగా తెలీదు గానీ ఒకటీ రెందు సంవత్సరాలుగా మరింత రాజుకున్నాయని చెప్పుకుంటున్నారు..

ఇదివరలో నాగార్జున నాగేశ్వ‌ర్ రావు 75ఏళ్ల సినీ వ‌సంతోత్స‌వ వేడుక జ‌రిపిన‌పుడు బాల‌య్య‌ను ఇన్వైట్ చేయ‌లేద‌ట నాగ్. తీరా ఫంక్ష‌న్ ద‌గ్గ‌ర ప‌డే స‌మ‌యానికి...బాల‌య్య అక్కినేని ఫ్యామిలీపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడ‌ట‌. మ‌రీ ముఖ్యంగా నాగార్జున పై. నాకు అక్కినేని నాగేశ్వ‌ర్ రావు అంటే ఎంతో గౌర‌వం. ఆయ‌న్ను నేను బాబాయ్ అని ప్రేమ‌గా పిలుస్తాను. నాన్న‌కు స్నేహితుడు.

మా ఇంట్లో ఏ కార్య‌మైనా కూడా ఆయ‌న్ను పిల‌వ‌కుండా, చెప్ప‌కుండా చేయం. కానీ చిరంజీవి, మోహ‌న్ బాబు లాంటి వాళ్ల‌ను కూడా పిలిచి ఇంత వ‌ర‌కు మాకు ఆహ్వానం రాలేదంటే తెలుస్తూనే ఉంద‌ని త‌న స‌న్నిహితుల ద‌గ్గ‌ర ఆగ్ర‌హంతో పాటు ఆవేద‌న కూడా చెందాడ‌ట. ఇక నంద‌మూరి ఫ్యామిలీ అధికారంలో లేద‌ని చిన్న చూపా లేకుంటే ఇంకేమైనానా అని సన్నిహితులదగ్గర చెప్పాడట. ఆ వార్తలు నాగ్ చెవిలో కూడా పడ్దాయని సమాచారం.

ఈ విష‌యం తెలిసిన నాగ్...స‌రిగ్గా మ‌రో రెండు రోజులు ముందు అక్కినేని వేడుక జ‌ర‌గ‌నుండగా నాగార్జున బాల‌య్య ఇంటికి వెళ్లాడట‌. ఆస‌మ‌యంలోనే ఇంట్లోనే ఉన్న బాల‌య్య‌తో దాదాపు అర‌గంట సేపు మాట్లాడాట‌. కానీ నాకు వీలు ప‌డ‌దు. నాకు ఆరోజు వేరే ప‌నులున్నాయ‌ని మొహం మీదే చెప్పాడ‌ట‌. దీంతో నాగార్జున ఉస్సూర‌మ‌ని ఉత్త చేతుల‌తో వెన‌క్కి వ‌చ్చాడు.

అంతే కాదు చిరంజీవిని కూడా గౌత‌మి పుత్ర శాతక‌ర్ణి వేడుక‌కు పిలిచిన బాలకృష్ణ...నాగ్ ను మాత్రం పిల‌వ‌లేదు. న‌న్ను అవ‌మానించిన వాళ్ల‌ను నేనెందుకు గౌర‌వించాల‌నే కోపంతోనే పిల‌వ‌లేద‌ని టాక్. రాజ‌కీయ నాయ‌కులు, ఇత‌ర న‌టుల‌కు ఆహ్వానం ప‌లికిన‌ బాల‌య్య‌...నాగార్జున‌కు గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి వేడుక‌కు కనీసం నాగార్జునకి ఇన్విటేషన్ కాదు కదా ఇంటిమేష‌న్ కూడా ఇవ్వ‌లేద‌ట‌.