December 03, 2017

nagarjuna-17-12-3

అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి నటించిన సినిమా మనం.. తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకున్న మాట వాస్తవమే. ఈ చిత్రం పాత్రలు.. నాగేశ్వరరావు-నాగార్జున-చై అంటూ పేర్లను వారికే మార్చి మార్చి పెట్టి అలరించిన తీరు.. పండించిన సెంటిమెంట్.. స్క్రీన్ ప్లేతో ఆకట్టుకున్న వైనం.. అందరికీ నచ్చేశాయి. అయితే.. ఈ చిత్రానికి నంది అవార్డుల ప్రదానంలో అన్యాయం జరిగిందనే మాట ఎక్కువగానే వినిపించింది. అయినా అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

తాజాగా ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న హలో చిత్రానికి ట్రైలర్ రిలీజ్ చేశారు. అక్కినేని అఖిల్ నటించిన రెండో చిత్రం కావడంతో.. ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో పక్కాగానే దీన్ని రూపొందించారు. కానీ ఈ ట్రైలర్ ప్రారంభంలో ఉన్న రెండు వాక్యాల గురించి మాత్రం.. ఇప్పుడు జనాల్లో విపరీతమైన చర్చ జరుగుతోంది. 'ఫ్రం ది డైరెక్టర్స్ ఆఫ్ మనం' అని కార్డ్ వేయడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ ఆ వెంటనే మనంను ఉద్దేశించి.. 'మీ హృదయాలను అవార్డ్ గా ఇచ్చిన చిత్రం' అనే అర్ధం వచ్చేలా ఓ కార్డ్ వేశారు.

పర్టిక్యులర్ గా అవార్డెడ్ అన్న పదం దగ్గరే జనాల డిస్కషన్ సాగుతోంది. మనం చిత్రానికి రెండో ఉత్తమ చిత్రం అని అవార్డ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ జనాల భావనలో మనం మూవీనే బెస్ట్ ఫిలిం అనే ఉద్దేశ్యాన్ని తట్టి లేపడంతో పాటు.. అవార్డులు ప్రకటించిన వారికి సైలెంట్ గా చురక అంటించే ఉద్దేశ్యంతోనే ఇలా ట్రైలర్ ద్వారా ట్రై చేశారని జనాల టాక్.