January 09, 2018

Pawan-Kalyan-NTR

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి విడుదలను స్వాగతిస్తూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా మాచర్లలోని రామా టాకిస్ వద్ద అజ్ఞాతవాసి సినిమాకు ఆల్ ద బెస్ట్ చెబుతూ ఫ్యాన్స్ ఫ్లెక్సీలు పెట్టారు. పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్‌ల ఫొటోలతో ఫ్లెక్సీలు పెట్టారు. ఇద్దరు స్టార్ల ఫ్యాన్స్ కలిసి ఇలా ఫ్లెక్సీలు పెట్టడాన్ని అంతా స్వాగతిస్తున్నారు.

ఇటీవలే పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రారంభోత్సవానికి హాజరై ఆదర్శం చాటారు. సరిగ్గా ఇప్పుడు ఇద్దరు స్టార్ల ఫ్యాన్స్ కూడా ఆదర్శవంతంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ప్రశంసల జల్లు కురుస్తోంది.