07 March, 2019

KTR-19-3-7

మనోడు కాదనే ముద్ర ఎవ్వరిమీదా వేయొద్దని పార్టీ క్యాడర్ కు సూచించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలైనా, ఇతర పార్టీ కార్యకర్తలైనా.. అందరూ మనోళ్లే.. అందరూ కేసీఆర్‌ మనిషులే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. సిరిసిల్లలో తనపై పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి కూడా రైతుబంధు పథకం కింద డబ్బులు తెచ్చుకున్నారని.. కాంగ్రెస్‌, తదితర పార్టీల కార్యకర్తలందరూ ప్రభుత్వ పథకాలతో లబ్ది పొందివరేనని వారందర్నీ ఓటు అడగడానికి మనకు మొహమాటం అవసరం లేదని చెప్పారు.

కరీంనగర్‌ జిల్లాలోని శ్రీరాజరాజేశ్వరీ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన కరీంనగర్‌ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. మనకు వ్యతిరేకంగా ఉన్నవారిని కూడా మనకు అనుకూలంగా మలుచుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్‌ను గౌరవిస్తారు.. ఇక ఎంపీ అభ్యర్థి ఎవరన్నది ముఖ్యం కాదు. ఓటేసేది కేసీఆర్‌కే మాత్రమే అనేది గుర్తు పెట్టుకోవాలని ప్రజలకు పిలుపు నిచ్చారు కేటీఆర్. ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేసి లోక్ సభ ఎన్నికల్లో ఘనవిజయం పార్టీకి కట్టబెట్టాలన్నారు.

రాష్ర్టానికి జాతీయ ప్రాజెక్టులు రావాలంటే 16 పార్లమెంట్‌ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలవాలన్నారు. తెలంగాణ తీర్పు ఏకపక్షంగా ఉంటేనే మన హక్కులను సాధించుకోగలమన్న కేటీఆర్.. ఢిల్లీ పీఠంపై ఎవరూ ఉండాలో గులాబీ పార్టీ నిర్ణయిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సీఎం కేసీఆర్‌ మనషులే అని.. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకొని పార్టీ నాయకులు పని చేయాలని టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

KTR, good speech, karim nagar meeting

----------------------------------------------------------------------------