KCR-Jana-Reddy-16-12-29

తెలంగాణా అసంబ్లీ సమావేశాల్లో హమ్మయ్య అనుకునే పర్వం నడిచింది. గత కొన్ని రోజుల నుంచీ సీరియస్ వాగ్భాణాల మధ్యన ఇప్పుడు తెలంగాణా అసంబ్లీ లో నవ్వులు విరిశాయి. డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ గురించి సీఎం కెసిఆర్ సుదీర్ఘమైన ప్రసంగా ఇచ్చారు. ఆ తరవాత ఆయన కూర్చోగా వెంటనే జానా రెడ్డి ప్రసంగం మొదలు పెట్టారు. సీఎం భోజనం చేసి వచ్చినట్టు ఉన్నారు అనగానే సభలో అందరూ నవ్వేసారు. ఆ తరవాత కాసేపటికి ప్రతిపక్ష నేతలు ముఖ్యమంత్రి ఇంటిక వెళ్లి భోజనం చేసే సాంప్రదాయం ఉండేది అని గుర్తు చేసారు.

అలాగే సీఎం లు సైతం ప్రతిపక్ష నేతల ఇళ్ళకు వెళ్లి భోజనం చేసేవారు అని కెసిఆర్ అన్నరు.తను సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జానారెడ్డి ఇంటికి భోజనానికి వెళ్దామని ఓ సారి అనుకున్నాను కానీ అప్పుడు ఉపఎన్నిక రావడంతో లేనిపోని మాటలు వస్తాయని భావించి ఆలోచనను విరమించుకున్నట్లు కేసీఆర్ చెప్పారు. త్వరలో ఖచ్చితంగా జానా ఇంటికి భోజనానికి వెళతాను అని కెసిఆర్ చెప్పుకొచ్చారు. " పప్పు పెట్టినా , పులుసు పెట్టినా కడుపు నిండా తిని వస్తాను " అంటూ కెసిఆర్ అసంబ్లీ లో నవ్వులు పూయించారు.

ఈ విషయం మీద మాట్లాడిన జానా ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల లబ్దిదారులు పాత రుణాలు మాఫీ చెయ్యాలని కోరుతున్నారు అనీ దానికి సంబంధించి తాము విజ్ఞప్తి చెయ్యగా సీఎం మాఫీ చెయ్యడం తమకి నచ్చింది అని చెపారు. తెలంగాణ ప్రభుత్వానికి ఈ సందర్భంగా ప్రజల తరఫున తాను అభినందనలు తెలుపుతున్నట్లు వివరించారు.

టీ అసంబ్లీ లో ఒకరి మీద ఒకరు అర్ధం లేని గొడవలు చెయ్యకుండా సాఫీగా సభని జరపడం జనాలకి ఆసక్తికరంగా మారింది. ఒకటే రాద్ధాంతాలు , గొడవలు లేకుండా జాగ్రత్తగా జనాలకి సంబందించిన వ్యవహారాల్లో వాద ప్రతివాదనలు నడవడం అందరికీ సంతోషకర విషయం.