11 April, 2019

Ali-Posani

వైసిపిలో చేరడాన్ని పవన్‌ తప్పుబట్టడం ఆలీకి అస్సలు నచ్చలేదు. తనకి సాయం చేసినా గుర్తుంచుకోలేదు అని పవన్‌ అన్న మాటలతో నొచ్చుకున్నాడు. పవన్‌ అన్న సాయం దేనిగురించి అనేది క్లారిటీ లేదు. వైసిపిలోనే చేరాలని వున్నపుడు టీడీపీలో టికెట్‌ ఎందుకు ఆశించి భంగపడ్డాడో మాత్రం చెప్పలేదు. అదలా వుంచితే... పవన్‌ని తాను పల్లెత్తు మాట అనలేదని ఆలీ బుకాయించాడు. నిజమే... పబ్లిక్‌ మీటింగ్స్‌లో, ఎలక్షన్‌ ర్యాలీల్లో ఆలీ ఏమీ అని వుండకపోవచ్చు. కానీ పవన్‌ని కిండల్‌ చేస్తూ పోసాని కృష్ణమురళి తీసిన 'ముఖ్యమంత్రిగారూ మీరు మాటిచ్చారు' సినిమాలో ఆలీ 'పవన్‌కళ్యాణ్‌'గా నటించాడు.

గత ఎన్నికల్లో పవన్‌ టీడీపీకి సపోర్ట్‌ ఇచ్చిన నేపథ్యాన్ని వాడుకుంటూ రాసిన ఈ క్యారెక్టర్‌లో ఆలీ ఎందుకు నటించినట్టు? పవన్‌ అంటే నిన్న ఆలీ వెన్నుపోటు గురించి బయట పడ్డాడు. మరి ఆలీ ఈ సినిమా ఎప్పుడో చేసాడు కదా? గుండెల్లో ఉన్న పవన్‌కళ్యాణ్‌ జేబులో లేడా? జేబులో పడే డబ్బుల కోసం గుండెల్లో వున్న వాడిని కామెడీ చేసినా ఫర్వాలేదా? ఈ ప్రశ్నలు సంధిస్తోన్న జన సైనికుల కోసం ఆలీ మరో వీడియో విడుదల చేయాల్సిందే.

----------------------------------------------------------------------------

Ali, posani krishna murali, pawan kalyan role

----------------------------------------------------------------------------