surya-24-movie

హీరో సూర్య నటించిన ‘24’ సినిమాకు 75 కోట్ల బడ్జెట్ స్వయంగా పెట్టాడట

ఈ వారం భారీ స్థాయిలో విడుదల కాబోతున్న కోలీవుడ్ హీరో సూర్య నటించిన ‘24’ ప్రమోషన్ ను మొదలు పెట్టి సూర్యా వివిధ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ ఇంటర్వ్యూలో సూర్య ఈసినిమా గురించి అనేక విషయాలు షేర్ చేస్తూ ఈ సినిమా బడ్జెట్ ను బయట పెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు.

ఈ ఇంటర్వ్యూను నిర్వహిస్తున్న పత్రికా ప్రతినిధి ‘24’ టైటిల్ వెనుక కథేంటో చెప్పమని అడిగితే ఈ సినిమా బడ్జెట్ లెక్కల్ని బయట పెట్టి షాక్ ఇచ్చాడు సూర్య ఈసినిమాకు 75 కోట్ల ఖర్చు అయిందని చెపుతూ కథను నమ్మి ఇంత బడ్జెట్ ఈ సినిమా పై పెట్టాను అంటున్నాడు సూర్య. అయితే ఈ ‘24’ టైటిల్ మీనింగ్ తెలుసుకోవాలంటే థియేటర్ కు రావాల్సిందే అని అంటూ ఆ నెంబర్ కు సినిమా కథకు ఒక కనెక్టివిటీ ఉంటుంది అని అంటున్నాడు.

అయితే ఒక దర్శకుడు చెప్పిన కథను నమ్మి ఒక హీరో స్వయంగా 75 కోట్ల బడ్జెట్ పెట్టడం ఒక సామాన్యమైన విషయం కాదు. ఇంత ఖర్చు ఈ సినిమాకు అవ్వడానికి గల కారణం ఈ ‘24’ చూస్తే తెలుస్తుంది అని అంటున్నాడు సూర్య. అయితే ఈ సినిమా కోసం ఇంత కష్టం పడ్డావు అని అడిగి నప్పుడు ‘‘నేను కావాల్సినంత డబ్బు సంపాదించాను. పేరు సంపాదించాను. మంచి ఫ్యామిలీ ఉంది. అభిమానులున్నారు. ఇప్పుడు నేను బాధ్యతగా వ్యవహరించాలి. వారికి నేనేం ఇవ్వగలను. మంచి సినిమాలను చేయడమే మార్గం. నేను ఈ విషయంలో కమల్ సార్‌ను ఫాలో అవుతాను. ఆయన హిట్లు, ఫ్లాపుల గురించి ఆలోచించరు. ఫ్రెష్ కంటెంట్ ఇవ్వడానికి ఇష్టపడతాను’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.

మన టాలీవుడ్ టాప్ హీరోలు అంతా రొటీన్ సినిమాలు తీసుకుంటు కాలం గడపుతూ ఉంటే కోలీవుడ్ హీరోలు మాత్రం ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ తమ సత్తాను చాటుకోవడానికి ప్రతత్నిస్తున్నారు. చిన్నప్పుడు సినిమా హీరో కావడానికి పనికి రావు అని తన తల్లి తండ్రులతోనే సెటైర్లు వేయించుకున్న సూర్య పరిస్థుతులు మారి దక్షిణ భారత సినిమా రంగంలోనే టాప్ హీరోగా ఎదగడం యాదృచ్చికం అనుకోవాలి..