Mahesh-babu-Rana-Prabhas

ఇండియా వైడ్ మోస్ట్ డిజైరబుల్ సర్వే లో మహేష్ బాబు కు నెం.6 స్థానం

ప్రతి ఏడాది టైమ్స్ సంస్థ మోస్ట్ డిజైరబుల్(ఎక్కువ మంది కోరుకునే) ఎవరు అనే అంశంపై సర్వే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సర్వే ఆయా రాష్ట్రాల్లో విడివిడిగా చేయడంతో పాటు నేషనల్ వైడ్ కూడా ఓ సర్వే నిర్వహిస్తారు. ఇటీవల హైదరాబాద్ టైమ్స్ విభాగం నిర్వహించిన సర్వే వివరాలు వెల్లడించారు. అందులో మోస్ట్ డిజైరబుల్ మెన్స్ లిస్టులో మహేష్ బాబు నెం.1 స్థానం దక్కించుకోగా, మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లిస్టులో అనుష్క నెం.1 స్థానం దక్కించుంది. తాజాగా ఇండియా వైడ్ నిర్వహించిన సర్వే వివరాలు విడుదల చేసారు టైమ్స్ సంస్థ వారు. మొత్తం 50 మందితో కూడిన టాప్ లిస్టును రిలీజ్ చేసారు.

2015 సంవత్సరానికి గాను నిర్వహించిన ఈ సర్వేలో బాలీవుడ్ నటుడు రణవీర్ సంగ్ నెం.1 స్థానం దక్కించుకున్నాడు. రణవీర్ సింగ్ తనకు నెం.1 స్థానం దక్కడంపై సంతోషం వ్యక్తం చేయడంతో పాటు ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమనార్హం. 2010లో నేను సినిమాల్లోకి వచ్చినపుడు అంతా నన్ను చూడ్డానికి ఏమంత బాగాలేవు అన్నారు. అందుకే నటన పరంగా నన్ను నేను నిరూపించుకోవడానికి ఎంతో కష్టపడ్డాను. ఇపుడు నాకు మోస్ట్ డిజైరబుల్ మెన్ గా నెం.1 స్థానం దక్కడం ఆనందంగా ఉంది అని చెప్పుకొచ్చాడు రణవీర్ సింగ్. ఇండియా వైడ్ నిర్వహించిన ఈ సర్వేలో టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లి నెం.2 స్థానం దక్కించుకున్నాడు. తెలుగు నుండి కూడా పలవురు స్టార్లకు లిస్టులో చోటు దక్కింది. మహేష్ బాబు నెం.6 స్థానం దక్కించుకుని తెలుగు స్టార్లందరికంటే ముందున్నారు. రానా, ప్రభాస్, రామ్ చరణ్ లాంటి స్టార్లు కూడా ఈ లిస్టులో ఉన్నారు.

రానా దగ్గుబాటి 11 వ స్థానం, ప్రభాస్ 13 వ స్థానం, రామ్ చరణ్ 38 వ స్థానం లో ఉండడం గమనార్హం.